టీడీపీ కార్యాలయాలపై దాడులు: మొదలైన అరెస్ట్‌లు.. బెజవాడ, గుంటూరు పోలీసుల అదుపులో 21 మంది

Siva Kodati |  
Published : Oct 23, 2021, 02:31 PM IST
టీడీపీ కార్యాలయాలపై దాడులు: మొదలైన అరెస్ట్‌లు.. బెజవాడ, గుంటూరు పోలీసుల అదుపులో 21 మంది

సారాంశం

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పది మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పది మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 21 మందిని అదుపులో తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని బాధితులను కోరారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభి బెయిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. 

మరోవైపు ఏపీ సీఎం Ys  Jagan పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiని శుక్రవారం నాడు rajahmundry Cnetral  జైలుకు తరలించారు పోలీసులు. ఈ నెల 21న పట్టాభిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో నవంబర్ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు పట్టాభికి Remand విధించింది కోర్టు. నిన్న సాయంత్రం ఆయనను మచిలీపట్టణం సబ్ జైలుకు పంపారు. రాత్రిపూట ఆయన అక్కడే ఉన్నారు. అనంతరం శుక్రవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని మచిలీపట్టణం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Also Read:జగన్ రెడ్డిది స్పెషల్ క్యారెక్టర్...ఆయనకు విలన్ అనే పేరు చిన్నది.. చంద్రబాబు

అంతకుముందు బుధవారం నాడు పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానానికి సమర్పించిన పట్టాభి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఇదిలా ఉంటే పట్టాభిని కస్టడీలోకి తీసుకోవాలని విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరో వైపు టీడీపీ పట్టాభి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ చేయనుంది కోర్టు. మరోవైపు టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీసీ నేతల దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 36 గంటల పాటు దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి పోటీగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. నిన్న రాత్రి 8 గంటలతో చంద్రబాబు దీక్ష ముగిసింది. 

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు