అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించిన చంద్రబాబు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 2, 2020, 8:53 PM IST
Highlights

ఇటీవలే బెయిల్ పై విడుదలయిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 

విజయవాడ: ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కోంటూ అరెస్టయి ఇటీవలే బెయిల్ పై విడుదలవడమే కాదు కరోనా నుండి కోలుకున్న మాజీ మంత్రి, టిడిఎల్పి ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడిని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్న చంద్రబాబు నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు కూడా దైర్యం చెప్పారు. 

వీడియో

ఇక మంత్రి పేర్నినాని అనుచరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ఇటీవలే బెయిల్ పై విడుదలైన మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా చంద్రబాబు పరామర్శించారు. స్వయంగా ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు చంద్రబాబు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మంచి వాళ్ళను ఎలా ఇబ్బంది పెడతారో ఇప్పుడు తెలుస్తోందన్నారు. అచెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసీ అరెస్ట్ చేశారని... ఆయనకు కరోనా రావడానికి కారణమయ్యారని ఆరోపించారు. అచెన్నను అరెస్ట్ చేయడానికి అసలు సాక్ష్యాలే లేవని ఏసిబి చేతులు ఎత్తేసిందన్నారు.

ఇక తన పిఎకి ఎవరో ఫోన్ చేసారని కొల్లు రవీంద్రపై కేసుపెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలా అక్రమ కేసులతో ఇద్దరు మాజీ మంత్రులు ను అరెస్ట్ చేశారన్నారు. ఇన్నేళ్లలో ఇలాంటి దుర్మార్గ ప్రబుత్వాన్ని చూడలేదన్నారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడేది లేదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్నారనే కేసులు పెట్టి వేధిస్తున్నారని... వీటిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చంద్రబాబు పేర్కొన్నారు. 

click me!