తండ్రి వైఎస్సార్ నిర్ణయాన్నే జగన్ వ్యతిరేకిస్తున్నారు..ఎలాగంటే: అయ్యన్న (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 02, 2020, 08:26 PM IST
తండ్రి వైఎస్సార్ నిర్ణయాన్నే జగన్ వ్యతిరేకిస్తున్నారు..ఎలాగంటే: అయ్యన్న (వీడియో)

సారాంశం

రైతులతో చర్చించకుండానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఏకపక్ష నిర్ణాయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. 

విశాఖపట్నం: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు మరో తుగ్లక్ నిర్ణయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రైతులపై మోయలేని భారం వేసేందుకు జగన్ పథకం రూపొందించారని మండిపడ్డారు. రైతులకు మేలు చేయాలని ఎన్టీ రామారావు ఆరోజుల్లోనే ఆస్పవర్ కు రూ.50లు విద్యుత్ బిల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం జగన్ ప్రతి మోటారుకు మీటరు పెట్టాలన్న దౌర్బాగ్యపు నిర్ణయం తీసుకున్నారని... విద్యుత్ నగదు బదిలీ అంటూ చేసే ఆలోచన అర్థం కావడంలేదన్నారు. 30 ఏళ్లలో లేని నిర్ణయాలు ఇప్పుడెందుకని, మళ్లీ అప్పులు చేయడానికా? అని ప్రశ్నించారు.  

రైతులతో చర్చించకుండా ఇలాంటి నిర్ణాయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.  18 లక్షల మోటార్లకు ఎంత బిల్లులు అవుతుందో ప్రభుత్వానికి తెలుసునని,  ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లింస్తే బాగుంటుదని సూచించారు. రైతులకు అకౌంట్లలో నగదు వేస్తామని  చెప్తున్నారు.. వేయకుంటే పరిస్థితేంటని ప్రశ్నించారు.  

read more  వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వివరణ ఇదీ..

రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి ఆ వడ్డీని తానే చెల్లిస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించలేదని దుయ్యబట్టారు.  దీంతో బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నాయని, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోతే రైతుల పరిస్థతి ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

వీడియో

"

 రైతు సంఘాలు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, యూరియా దొరక్క, గిట్టుబాటు ధరల్లేక పంటలను కొనేనాదుడు లేరన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని రద్దు చేసి మళ్లీ జగన్ ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. రైతులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రంలో 55 శాతం మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు.  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్సులు ప్రవేశపెడితే ఆ వాహనాలు నిలిపేశారని, ప్రసవించినందుకు బాలింతలకు ఇచ్చే నగదును నిలిపేయడం మంచిదికాదన్నారు. చంద్రబాబు ఏ పథకాలు ప్రవేశపెట్టినా రద్దు చేసే పనిలో జగన్ ఉన్నారని అయ్యన్నపాత్రుడు మండి పడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations in Amaravati : రాజధాని అమరావతిలోతొలిసారి గణతంత్ర వేడుకలు | Asianet Telugu
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే