ఏపీలో మెగా వ్యాక్సినేషన్: 8 లక్షల మందికి వ్యాక్సిన్ టార్గెట్

By narsimha lodeFirst Published Jun 20, 2021, 1:59 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ సర్కార్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టింది.  రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 8 లక్షల మందికి వ్యాక్సినేష్ వేయాలని జగన్ సర్కార్ ప్రణాళికను సిద్దం చేసింది. ఆదివారం నాడు మధ్యాహ్నానికి  5 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. 

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఏపీ సర్కార్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టింది.  రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 8 లక్షల మందికి వ్యాక్సినేష్ వేయాలని జగన్ సర్కార్ ప్రణాళికను సిద్దం చేసింది. ఆదివారం నాడు మధ్యాహ్నానికి  5 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. 

 రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో  వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. మ.12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ప.గో జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 59వేల మందికి,విశాఖ జిల్లాలో 50వేలు,తూ.గో జిల్లాలో 42వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు.కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.

రాష్ట్రంలో కరోనా కేసులు ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ మే మొదటి వారం నుండి  పగటి పూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కర్ఫ్యూతో పాటు వ్యాక్సినేషన్ ను కూడ వేగవంతం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే  ఇవాళ మెగా వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

మొదటి డోసు తీసుకొని విదేశాలకు వెళ్లే వారు కూడ ఇవాళ వ్యాక్సిన్ తీసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  రెండు రోజుల క్రితం ఏపీకి సుమారు 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందాయి.  
 

click me!