పీసీఏ చైర్మెన్ గా కనగరాజ్‌ జగన్ సర్కార్ నియామకం

By narsimha lode  |  First Published Jun 20, 2021, 4:56 PM IST

ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ)ని ఏపీ  రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసింది.  ఈ అథారిటీకి  చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎస్‌ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. 



అమరావతి: ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ)ని ఏపీ  రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసింది.  ఈ అథారిటీకి  చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎస్‌ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. 

పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏను ఏర్పాటు చేసింది.  పోలీసులు న్యాయం చేయకపోయినా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయినా సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.

Latest Videos

undefined

పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి.  తెలంగాణలో సైతం ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించాలని సుప్రీం కోర్టు నిబంధన పెట్టింది. 

పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌తోపాటు ఒక స్వచ్ఛంధ సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా వుంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు  చేస్తుంది. పీసీఏ  సిఫారసులను సర్కార్ కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పీసీఏకు సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

click me!