టైపింగ్ పొరపాటుకు ఇంత కక్ష సాధింపా: ఆశోక్ బాబు అరెస్ట్ పై బాబు

By narsimha lode  |  First Published Feb 11, 2022, 1:46 PM IST


పోలవరంలో అవినీతిని ఎందుకు నిరూపించలేకపోయారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.


అమరావతి: పోలవరంలో అవినీతి జరిగిందని తమపై విమర్శలు గుప్పించిన జగన్ ... ఎందుకు వాటిని నిరూపించలేకపోయారని TDP చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.శుక్రవారం నాడు అమరావతిలో టీడీపీ చీఫ్ Chandrababu Naidu మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న సమయంలో  Polavaramలో అవినీతి జరిగిందని YS Jagan చేసిన ఆరోపణల వీడియోను చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు.  తమ ప్రభుత్వం లో ఉన్న సమయంలోని ఎస్టిమేషన్స్ నే తీసుకొన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 

Visakhapatnam కు రైల్వే జోన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ఆర్ధిక వ్యవస్థలు దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసే అప్పులు ప్రజలే తీర్చాల్సి ఉంటుందన్నారు.రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల అప్పుందన్నారు. బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారన్నారు. 

Latest Videos

రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి జగన్ తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కు స్వంత లాభం తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు.. అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు.రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదను దోచుకొంటున్నారని చెప్పారు. 

జగన్ సర్కార్  ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడంతో పాటు వేధింపులకు దిగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీనే ఉండదనుకొంటున్నారు, ఇతనే చివరి ముఖ్యమంత్రిగా జగన్ భావిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో పాటు,  రైల్వేజోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర వాటిపై కేంద్రంతో జగన్ ఎందుకు తాడో పేడో తేల్చుకోవడం లేదో చెప్పాలన్నారు. తన కేసుల గురించే  జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, లిక్కర్ ధరలు ఏపీలోనే ఎక్కువ అని తెలిపారు. సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దేశమంతా ఎంతో కొంత పరిహారం ఇచ్చినా జగన్‌  మాత్రం రూపాయి సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు.. 

ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.. వైసీపీ నేతలు కోటీశర్వులౌతుంటే పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ప్రతి నెల పేదలపై వేల రూపాయాల అదనపు భారం ప్రభుత్వం మోపుతుందని చంద్రబాబు విమర్శించారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

టైపింగ్ పొరపాటుపై .. కక్షసాధింపా

ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్ట్ పై చంద్రబాబు స్పందించారు.  జగన్ సర్కార్ ఉద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని .. ఈ విషయమై చర్చలకు రావాలని ఆశోక్ బాబు సవాల్ విసరడంతో ఆయనపై తప్పుడు కేసు బనాయించారని చంద్రబాబు చెప్పారు. విజయవాడకు చెందిన మెహర్ కుమార్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారన్నారు. క్విడ్‌కో ప్రో లో భాగంగానే మెహర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారన్నారు. మెహర్ కుమార్ భార్యకు బ్రహ్మణ కార్పోరేషన్ లో నామినేటేడ్ పదవి ఇచ్చారన్నారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంత కక్ష సాధింపు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 


 

click me!