పార్టీ నాయకులపై నిఘా కోసం... టిడిపి ప్రత్యేక ఏర్పాట్లు

Arun Kumar P   | Asianet News
Published : Feb 16, 2021, 10:43 AM IST
పార్టీ నాయకులపై నిఘా కోసం... టిడిపి ప్రత్యేక ఏర్పాట్లు

సారాంశం

టిడిపి కార్యకర్తలు తమ సమస్యలతో పాటు నాయకులకు, పార్టీకి సంబంధించిన ఫిర్యాదులను కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలపవచ్చని లోకేష్ పేర్కొన్నారు.     

అమరావతి: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. నాయకులు పార్టీని వీడుతున్నప్పటికి వెన్నెముకలా నిలిచిన కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటుచేసి అన్నివేళలా వారికి అందుబాటులో వుంటామన్న సంకేతాలిచ్చారు. కార్యకర్తలు తమ సమస్యలతో పాటు నాయకులకు, పార్టీకి సంబంధించిన ఫిర్యాదులను ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలపవచ్చని లోకేష్ పేర్కొన్నారు.  
  
టిడిపి పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ అనుబంధ సంస్ధల చైర్మన్లు, పార్టీ ఇంచార్జిలు ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ప్రస్తుతం పార్టీ పదవులలో వున్న వారిపై నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇందుకోసమే ఐ టిడిపితో పాటు తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటుచేశామన్నారు. కార్యకర్తలు ఆదారాలతో సహా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని టిడిపి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. 

తెలుగుదేశం పార్టీ కాల్ సెంటర్ నెంబర్ 

+91 73062 99999 

+91 755 755 7744

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్