మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఆదివారం నాడు సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరిగేషన్ శాఖకు చెందిన సర్వేయర్లను కొద్దిసేపు టీడీపీ వర్గీయులు అడ్డుకొన్నారు. ఎఫ్‌ఎంబీ బుక్స్ ను టీడీపీ కార్యకర్తలుఎత్తుకెళ్లారు.
నర్సీపట్నం:మాజీ మంత్రి Ayyanna Patrudu, ఇంటి వద్ద ఆదివారం నాడు సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులతో అయ్యన్నపాత్రుడి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. సర్వే కోసం వచ్చిన సర్వేయర్ల వద్ద ఉన్న పీల్డ్ మేజర్‌మెంట్ బుక్స్ ను TDP కార్యకర్తలు ఎత్తుకెళ్లడంతో Police తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం నాడు ఉదయం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి Wall ను కూల్చివేశారు. అయితే JCB ఆపరేటర్లు గోడ మధ్యలో కూల్చివేసి వెళ్లిపోయారు. జేసీబీ ఆపరేటర్లను టీడీపీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్డీఓ గోవిందరాజులు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుండి జేసీబీ ఆపరేటర్లను రప్పించే ప్రయత్నం చేశారు.
undefined
ఇవాళ మధ్యాహ్నం RDO గోవిందరాజులుతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతి చర్చించారు. జాయింట్ సర్వే నిర్వహించాలని ఆర్డీఓకు అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీ మెంబర్లు వినతిపత్రం ఇచ్చారు. అయితే జాయింట్ సర్వే కాకుండా ఐదుగురు సభ్యుల బృందంతో సర్వే చేస్తామని ఆర్డీఓ చెప్పారు. సర్వే కోసం సర్వేయర్ల బృందం నుండి పీల్డ్ మేజర్ మెంట్ బుక్స్ టీడీపీ కార్యకర్తలు లాక్కెళ్లారు.ఈ బుక్ ను తీసుకెళ్లేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒక Conistable ను టీడీపీ కార్యకర్తలు నిర్భంధించారు. ఇదే సమయంలో పోలీసులు అయ్యన్న ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ ను బయటకు తీసుకువచ్చారు. అదే విధంగా ఇరిగేషన్ అధికారుల పీల్డ్ మేజర్ మెంట్ బుక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పంట కాలువ ఆక్రమించుకొని ఇంటిని నిర్మించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసుల సహాయంతో రెవిన్యూ అధికారులు కూల్చి వేశారు. పంట కాలువలో రెండు సెంట్ల భూమిని ఆక్రమించారని అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేశారు.
పంట కాలువను ఆక్రమించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారని ఆరోపిస్తూ ఆదివారం నాడు తెల్లవారుజామున రెవిన్యూ పోలీస్ అధికారులు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు ఐపీఎస్ అధికారి, ఆర్డీఓ సహా భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చి అయ్యన్నపాత్రుడి ఇంటి వెనుక భాగంలో నిర్మించిన గోడను కూల్చివేశారు. పంట కాలువలో సుమారు 3సెంట్ల భూమిని ఆక్రమించుకొని అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు.
తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటాని ఆర్డీఓ చెప్పారు. గతంలో ఇదే విషయమై అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇస్తే తీసుకోలేదన్నారు. దీంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారన్నారు. మరో వైపు ఇవాళ ఉదయం కూడా నోటీసులు ఇచ్చి గోడను కూల్చివేశామని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు.
also read:కక్షసాధింపే: అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతపై చంద్రబాబు
ఇదిలా ఉంటే తాము అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని అయ్యన్నపాత్రుడి రెండో కొడుకు రాజేష్ చెప్పారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని రాజేష్ మీడియాకు వివరించారు. తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.