సైకిల్ దే కాకినాడ కార్పొరేషన్

Published : Sep 01, 2017, 12:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సైకిల్ దే కాకినాడ కార్పొరేషన్

సారాంశం

ఏకపక్షంగా సాగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో మొత్తం 48 డివిజన్లలో  టిడిపి 32డివిజన్లలో గెలిచింది. కాగా వైసీపీ 10 చోట్ల, బారతీయ జనతా పార్టీ 3, ఇతరులు ముగ్గురు గెలిచారు. ఈ ముగ్గురు కూడా టిడిపి తిరుగుబాటు అభ్యర్ధులే. పొత్తుల్లో భాగంగా టిడిపి 39 డవివిజన్లలోనే పోటీ చేయగా, భాజపా 9 చోట్ల పోటి చేసింది.

కాకినాడ కార్పొరేషన్ను 30 ఏళ్ళ తర్వాత తెలుగుదేశంపార్టీ సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో మొత్తం 48 డివిజన్లలో  టిడిపి 32డివిజన్లలో గెలిచింది. కాగా వైసీపీ 10 చోట్ల, బారతీయ జనతా పార్టీ 3, ఇతరులు ముగ్గురు గెలిచారు. ఈ ముగ్గురు కూడా టిడిపి తిరుగుబాటు అభ్యర్ధులే. పొత్తుల్లో భాగంగా టిడిపి 39 డవివిజన్లలోనే పోటీ చేయగా, భాజపా 9 చోట్ల పోటి చేసింది.

శుక్రవారం కౌటింగ్ మొదలైనప్పటి నుండి టిడిపి హవా స్పష్టంగా కనబడింది. కొన్ని డివిజన్లలో మాత్రం వైసీపీ అధికారపార్టీకి గట్టిపోటి ఇచ్చింది. కాగా హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్త అదికారపార్టీ వేసిన ఎత్తులతో దాదాపు ఏకపక్షంగానే సాగింది.

సరే, ఎన్నికలో టిడిపి ఎన్ని ఎత్తులు వేసినా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కుడా 10 డివిజన్లలో గెలిచి పరువు నిలుపుకుంది. నిజానికి టిడిపి అంచనాల ప్రకారం వైసీపీకి 10 డివిజన్లు కుడా రాకూడదు. కాకపోతే ఈ డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు బలమైన వారు కావటంతో టిడిపి ఎంత ప్రయత్నాలు చేసినా గెలుపు సాధ్యం కాలేదు.

అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 9 డివిజన్లలో 6 చోట్ల టిడిపి తిరుగుబాటు అభ్యర్ధులున్నారు. టిడిపి కూడా తమ అభ్యర్ధులకే మద్దతుగా నిలిచినట్లు సమాచారం. అంటే 6 డివిజన్లలో బాజపా, టిడిపి రెబల్ అభ్యర్ధి, వైసీపీ అభ్యర్ధి మధ్య పోటీ జరిగినట్లు లెక్క. త్రికోణ పోటీలో చివరకు వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. దాంతో వైసీపీకి గౌరవప్రదమైన స్ధానాలే దక్కాయి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu