మద్యం కంపెనీలు, షాపులను తమ చేతుల్లోకి తీసుకోవడం కోసం మద్యం పాలసీని సీఎం జగన్ మార్చారని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు విమర్శించారు.
అమరావతి:మద్యం కంపెనీలు, షాపులు తమ చేతిలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే మద్యం పాలసీని ఏపీ సీఎం వైఎస్ జగన్ మార్చారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
TDP ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Atchannaidu గురువారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే మధ్య నిషేధం విధిస్తామని YS Jagan హామీ ఇవ్వలేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. Liquorపై పది వేల కోట్ల ఆదాయం కోసం జగన్ టార్గెట్ గా పెట్టుకొన్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.
undefined
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు పెరిగాయన్నారు.2014-15లో మద్యం విక్రయాల ద్వారా రూ.11,569 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.2021-22లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 24,714 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
నాటుసారా మరణాలపై చర్చించాలని తాము అసెంబ్లీలో కోరితే సస్పెండ్ చేస్తారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మద్యంపై ఆదాయాన్ని తగ్గిస్తానని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకోవడం మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో తెచ్చిన డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు. Chandrababu పథకాలను రద్దు చేసిన జగన్ కు డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. డిస్టిలరీలన్నీ జగన్ బినామీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రతి మాట అవాస్తవమన్నారు.
మద్యం పాలసీపై ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన చర్చలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన డిస్టిలరీలు మినహా తమ ప్రభుత్వం కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. అంతేకాదు టీడీపీకి చెందిన నేతలకే బ్రేవరేజీస్ కంపెనీలున్నాయన్నారు.
మద్యం బ్రాండ్లకు కూడా చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చిందన్నారు. 254 కొత్త మద్యం బ్రాండ్లకు బాబు సర్కార్ అనుమతిని ఇచ్చిందని జగన్ చెప్పారు. జంగారెడ్డిగూడెం మరణాలపై నిన్న టీడీపీ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద టీడీపీ నిరసనకు దిగిన సమయంలోనే ఏపీ అసెంబ్లీలో మద్యంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.