గుంటూరు వ్యాప్తంగా సొసైటీ బ్యాంకు అక్రమాలపై తెలుగుదేశం నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీ నేతల కారణంగానే అక్రమాలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. అక్రమాలు, రుణాల వెనుక వైసీపీ నేతలే ఉన్నారని దుయ్యబట్టారు.
గుంటూరు : Guntur జిల్లా వ్యాప్తంగా Society Bankలో జరిగిన అక్రమాలపై తగు సాక్షాలు మాదగ్గర ఉన్నాయి. YCP నాయకుల ఆధ్వర్యంలో మాత్రమే కోట్లలో అక్రమాలు జరిగాయి. వైసీపీ నాయకులు రాజకీయ ఒత్తిడులతో మాత్రమే సొసైటీ ఉద్యోగులు సహకరించారు. తాడికొండ నియోజక వర్గంలో కూడా భారీ అక్రమాలు జరిగాయి. అనేక రకాలుగా అక్రమాలు చేయడానికి వైసీపీ స్కాం బయట పెడతాం అంటూ తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో Dhulipalla Narendraతో పాటు శ్రవణ్ కుమార్ మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కామెంట్స్
జిల్లాలో రైతాంగం పరిస్థితి దయనియ్యంగా ఉంది. కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు, అలాంటి సమయంలో అక్రమంగా సొసైటీ బ్యాంక్ ల్లో డబ్బును దోచుకున్నారు. సొసైటీ బ్యాంక్ చైర్మన్ రాతం శెట్టి రాము ఆధ్వర్యంలో వైసీపీ నాయకులకు అక్రమంగా దోచి పెట్టలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వందల కోట్ల అక్రమాలు జరిగాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల డబ్బును దోచుకున్నారు. బినామీ గ్రూపుల పేరుతో అక్రమ లోన్లు తీసుకున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి రాగానే కొత్తరకం దోపిడీకి తెరలేపారు, నకిలీ పాస్ బుక్స్ సృష్టించి అక్రమాలకు పాల్పడితే పట్టించుకోని పరిస్థితి. మాచర్ల ప్రాంతంలోని మంచికల్లు, మాచర్ల, సిరిగిరిపాడు, పలు ప్రాంతాల్లో కోట్లలో అక్రమంగా రుణాలు పొందారు. తాకట్టులో ఉన్న పొలాలు, స్థలాలు కూడా రుణాలు మంజూరు చేసిన ఘనులు.. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కాకుమాను పీఎస్ లోకూడా కోట్లలో అక్రమంగా రుణాలు మంజూరు చేసిన ఘనులు వైసీపీ నేతలు అని దుయ్యబట్టారు.
నకిలీ ఆధార్ లు, నకిలీ పాస్ పుస్తకాలు, సృష్టించికాకుమాను మండలం బీ కే పాలెం పీఎస్ లో ఋణాలు మంజూరు చేసిన ఘటనలు ఉన్నాయి. రైతులను తప్పుదోవ పట్టించడానికి జి డీ సీసీ బ్యాంక్ చైర్మన్ రాము సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. రైతుల బ్యాంక్ లో అక్రమాలు జరిగితే ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక విచారణ చేపట్టలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పీఎస్ లో కోట్ల రూపాయలు వైసీపీ నేతలు అక్రమ ఋణాలు మంజూరు చేశారని ఎద్దేవా చేశారు.
మాచర్ల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో వైసీపీ నేతలు కోట్లలో అక్రమ రుణాలు పొందారన్నారు. ఇంతవరకు సొసైటీ బ్యాంక్ అధికారులు ఎక్కడా పోలీస్ కేసు నమోదు చేయలేక పోవడానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన కార్యావర్గాన్ని వెంటనే తొలగించి ప్రత్యేక విచారణ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సొసైటీ పెట్టిన తర్వాత దాని పరిధిలోని కొంత ప్రాంతంలో మాత్రమే లోన్లు ఇవ్వాలన్న రూల్స్ చైర్మన్, అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. అక్రమంగా రైతుల డబ్బును దోచుకున్న వైసీపీ నేతలపై వెంటనే కేసులు నమోదు చేసి డబ్బును వాపసు చేయాలన్నారు. వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగితే త్రి మాన్ కమిటీ, చైర్మన్ ఏమి చేస్తున్నారు? ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.. ఇది ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.
సంఘం డైరీకి ప్రభుత్వానికి ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది.సెంట్రల్ బ్యాంక్ నుంచి సొసైటీ వరకు ప్రత్యేక విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.