ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి నుండి టీడీపీ ఎమ్మెల్సీలను గురువారం నాడు సస్పెండ్ చేశారు. నిన్న కూడా ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలు స్సపెండైన విషయం తెలిసిందే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి నుండి గురువారం నాడు కూడా TDP ఎమ్మెల్సీలు సస్పెండ్ అయ్యారు. నిన్న కూడా ఆరుగురు టీడీపీ MLC సస్పెండైన విషయం తెలిసిందే.గురువారం నాడు టీడీపీ సభ్యులు రామ్మోహన్ రావు, రాజనర్సింహులు, రామారావు, ఆశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, దీపక్ రెడ్డి లను మండలి నుండి Suspend చేస్తున్నట్టుగా మండలి ఛైర్మెన్ ప్రకటించారు. శాసనమండలి ప్రారంభమైన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీలు విజిల్స్ వేస్తూ చిడతలు వాయిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల తీరును మండలి చైర్మెన్ Koyye Moshenu Raju తీవ్రంగా తప్పు బట్టారు.
ఇవాళ శాసనమండలిలో మద్య నిషేధం అమలుపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని శాసనమండలి చైర్మెన్ తిరస్కరించారు. అయితే ఈ తీర్మానంపై టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.ఈ సమయంలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. ప్రతి రోజూ టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారన్నారు.
ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, బూమ్ బూమ్ అనేది ఎప్పుడు పర్మిషన్లు ఇచ్చారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టలరీకి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. డిస్టిలరీలు అన్ని టీడీపీ నాయకులవే అన్నారు
టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. TDP సభ్యులు బిచ్చగాళ్లలగా వ్యవహరించారని మంత్రి కన్నబాబు విమర్శించారు. పెద్దల సభలో చిల్లరగా గలాటా చేస్తున్నారని మంత్రి Kanna babu మండిపడ్డారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతూ నిరసనకు దిగారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ పట్టుబుడుతుంది. ఇదే డిమాండ్ తో టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. నిన్న కూడా ఇదే విషయమై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సస్పెండయ్యారు.
అసెంబ్లీలో కూడా టీడీపీ సభ్యులు ఇదే డిమాండ్ తో ఆందోళనకు దిగారు. దీంతో నిన్న, ఇవాళ కూడా టీడీపీ సభ్యలను శాసనసభ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ సభ్యులపై డబ్బులు విసిరిన దువ్వాడ శ్రీనివాస్
మండలిలో చిడతలు వాయిస్తున్న తమపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు విసిరినట్టుగా టీడీపీ సభ్యులు చెబుతున్నారు. తమపై డబ్బులు విసిరిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. సస్పెండైన సభ్యులు ఇదే డిమాండ్ తో సభలో కూడా నిలబడి నిరసనుకు దిగారు. సస్పెండైన తర్వాత కూడా సభ్యులు సభలోనే ఉండడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.