దీనిని కూడా భావప్రకటనా స్వేచ్ఛ అంటారా.. ఎంపీ భరత్‌ను అరెస్ట్ చేయాలి : రాజమండ్రి ఘటనపై అచ్చెన్నాయుడు

By Siva KodatiFirst Published Oct 18, 2022, 3:07 PM IST
Highlights

ప్రస్తుతం అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి నగరం మీదుగా సాగుతోంది. ఈ  క్రమంలో అమరావతి రైతులపై మంగళవారం కొందరు వ్యక్తులు చెప్పులు, వాటర్ బాటిల్స్‌ను విసిరారు. వీరంతా వైసీపీ మద్ధతుదారులుగా తెలుస్తోంది. దీనిపై టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా వుండాలనే ఉద్దేశ్యంతో రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు ప్రస్తుతం ఆటంకాలు ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటి ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి యాత్ర ప్రవేశించిందో నాటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం రైతుల పాదయాత్ర రాజమండ్రి నగరం మీదుగా సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి రైతులపై మంగళవారం కొందరు వ్యక్తులు చెప్పులు, వాటర్ బాటిల్స్‌ను విసిరారు. వీరంతా వైసీపీ మద్ధతుదారులుగా తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ కనుసన్నల్లోనే ఇది జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రైతుల పాదయాత్రలోకి మార్గాని భరత్ దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతులు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ... అన్నదాతలకు మద్ధతుగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నిలిచాయి. 

ALso REad:రాజమండ్రి : అమరావతి రైతులపై చెప్పులు విసిరిన వైసీపీ శ్రేణులు.. ఎంపీ మార్గాని భరత్ కనుసన్నల్లోనే ..?

Latest Videos

దీనిపై టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ దాడిని కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారా అంటూ డీజీపీని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారంటూ ఆయన ఫైరయ్యారు. తక్షణమే ఎంపీ భరత్, అతని రౌడీలను అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీస్ శాఖ .. వీరిని మాత్రం రైతుల పాదయాత్రలోకి ఎలా అనుమతించారంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

ఇకపోతే.. గతవారం తూర్పుగోదావరి జిల్లా నిదడవోలులోనూ ఇదే రకమైన పరిస్ధితి నెలకొంది. స్థానిక ఓవర్‌బ్రిడ్జి పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు ఉదయం నుంచి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు నేతలు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేశారు. 

click me!