మోదీ అంటే గౌరవం.. అలా అని నా స్థాయిని నేను చంపుకోను: బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Oct 18, 2022, 2:44 PM IST
Highlights

కొంతమందికి తాను చేసేది అవకాశవాద రాజకీయంగా కనిపిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అయితే తాను ఐడీయాలజీ కోసం, ప్రజల కోసం పనిచేస్తానని.. కానీ విలువలు మాత్రం కోల్పోకుండా ఉంటానని చెప్పారు.

కొంతమందికి తాను చేసేది అవకాశవాద రాజకీయంగా కనిపిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అయితే తాను ఐడీయాలజీ కోసం, ప్రజల కోసం పనిచేస్తానని.. కానీ విలువలు మాత్రం కోల్పోకుండా ఉంటానని చెప్పారు. దానిని అవకాశ వాదం అంటే తనకేమి అభ్యంతరం లేదని అన్నారు.   పవన్ కల్యాణ్ ఈరోజు మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీతో పొత్తు గురించి కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇస్లాంను నేను చాలా గౌరవిస్తానని తెలిపారు. ఇస్లాంను గౌరవించే హిందువునని అన్నారు. ఇస్లాంకు చెందిన ఉగ్రవాది బాంబు దాడి చేస్తే ముస్లిం సోదరులందరిని అంటామా?.. ఎవడైతే బాంబు పేల్చాడో వాడి తాటతీస్తామని అన్నారు. ‘‘ఈరోజు తెలంగాణ నాయకులు ఒక్కరు మాట్లాడుతూ.. మీ ఆంధ్రలో అందరూ బీజేపీ అనుకూలమే కదా అని అన్నారు’’ అని చెప్పారు. కేంద్రంలో ఉన్నవాళ్లకు నమస్కారం చేయాలని.. వేరే దారి లేదని అన్నారు. ముస్లిం సోదరులు వైసీపీ నమ్మే బదులు.. జనసేనను నమ్మండి అని పిలపునిచ్చారు. 

Also Read: తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా.. నేను యుద్దానికి రెడీ: వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుంది. దాడులపై గవర్నర్ దగ్గరు తమ టీమ్‌ను పంపుతామని చెప్పారు. బీజేపీని రోడ్డు మ్యాప్ అడుగడమేమిటని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ‘‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలుసు. మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. పవన్ కల్యాణ్ పదవి కోసమైతే ఇంత ఆరాట పడడు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే.. ముందుగా అభివృద్ది కోసమే పనిచేస్తానని చెప్పారు.

click me!