
ప్రభుత్వంపై టిడిపి ఎంఎల్సీ చక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు టిడిపి నేతైన చక్రపాణి ప్రభుత్వంపై ధ్వజమెత్తటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా మరో విచిత్రం కూడా జరిగింది. జిల్లా పరిషత్ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదంటూ తెలుగుదేశం, వైసీపీ జడ్పీటీసీలిద్దరూ ఏకమయ్యారు.
నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటన తొందరలో వెలువడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో వైసీపీతో టిడిపి జడ్పీటీసీ కలిసి ప్రబుత్వంపై మండిపడటాన్ని జిల్లా మంత్రులు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశం జరిగిందతి. ఇందులో పాల్గొన్న ఎంఎల్సీ శిల్సా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం జిల్లా పరిషత్ కు నిధులు మంజూరు చేయకపోవటంతో అందరూ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నట్లు వాపోయారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడును అడిగినా ఉపయోగం లేకపోయిందని మండిపడ్డారు.
ఎప్పుడైతే చక్రపాణి రెడ్డి నిధుల సమస్యను ప్రస్తావించారో వెంటనే వైసీపీ, టిడిపిలకు చెందిన జడ్పీటీసీలు కూడా రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. చక్రపాణిరెడ్డికంటే ఆయన సమస్యలు ఆయనుకున్నాయి. మరి, టిడిపి జడ్పీటీసీలు కూడా వైసీపీతో ఎందుకు కలిసారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
సమావేశం మొదలవ్వగానే స్వపక్షమే విపక్షంతో కలిసిపోవటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దాంతో మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ కు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. జిల్లా పరిషత్ కు నిధులు రావటం లేదన్నది వాస్తవం. ఈ విషయాన్ని స్వయంగా అధికారపార్టీ ఎంఎల్సీనే చెబుతున్నారు. చక్రపాణిరెడ్డిని మాట్లాడనీయకుండా ఛైర్మన్ అడ్డుకోబోయారు. దాంతో ఎంఎల్సీ నిరసన తెలిపి బయటకు వెళ్లిపోయారు. మరింత ఆశ్చర్యంగా వైసీపీ, టిడిపి జడ్పీటీసీలు కూడా సమావేశాన్ని బహిష్కరించి సమావేశంహాలు నుండి బయటకు వెళ్లిపోయి నిరసన వ్యక్తం చేసారు.