బాబుగారిదే ‘ఉత్తమ’ ప్రదర్శన

First Published Dec 3, 2017, 8:08 AM IST
Highlights
  • ప్రతిపక్షం బహిష్కరించిన అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తమకు తాము ఉత్తమ ప్రదర్శన అంటూ రేటింగ్స్, ర్యాంకింగులు ఇచ్చేసుకున్నారు.

ప్రతిపక్షం బహిష్కరించిన అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తమకు తాము ఉత్తమ ప్రదర్శన అంటూ రేటింగ్స్, ర్యాంకింగులు ఇచ్చేసుకున్నారు. అంటే నటించేది వాళ్ళే, ర్యాంకులు, రేటింగులు ఇచ్చుకునేదీ వాళ్ళే. అంతేకాదు సదరు ర్యాంకులను ప్రకటించేది కూడా వాళ్ళే. ఎలాగుంది టిడిఎల్పి నిర్ణయం. ఈ ర్యాకింగులు, రేటింగుల ముందు నంది అవార్డలు ఎందుకైనా పనికి వస్తాయా?

నంది అవార్డుల విషయంలో జరిగిన రచ్చ అంతా చూసిందే. కాకపోతే ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే, ఇది పూర్తిగా ఓ రాజకీయపార్టికి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి రచ్చ చేయాలన్నా సాధ్యం కాదు. ప్రతిపక్షం లేకున్నా శాసనసభ ఘనంగా జరుగిందన్న సంకేతాలు ఇవ్వడానికి చంద్రబాబూ బాగా తపన పడ్డారు.

 12 రోజుల పాటు జరిగిన సభలో ఎనిమిది రోజులు చంద్రబాబు ఉత్తమ ప్రదర్శనకు ఎంపికయినట్టుగా టిడిఎల్పీ నిర్ణయించిందట. ఇక మంత్రి నారా లోకేష్ రెండు రోజులు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు తలా ఒక్కో రోజు ర్యాంకింగ్‌లు దక్కించుకున్నారు. శాఖల విషయానికి వస్తే దేవినేని ఉమ, ఆదినారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు అద్భుతమట.  

click me!