10 శాతం రిజర్వేషన్ కావాలి

First Published Dec 2, 2017, 5:55 PM IST
Highlights
  • కాపులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 5 శాతం రిజర్వేషన్ తమకు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

కాపులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 5 శాతం రిజర్వేషన్ తమకు ఆమోదయోగ్యం కాదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపులను బిసిల్లో చేరుస్తూ మంత్రివర్గం ఆమోదం తర్వాత శనివారం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సంగతి అందరకీ తెలిసిందే. అదే విషయమై కాపు నేతలతో ముద్రగడ తన నివాసంలో చర్చించారు.  జెఎసిలో చర్చించిన వివరాలను మీడియాకు వివరిస్తూ, తమకు 5 శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్దితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. తమకు కనీసం 10 శాతం రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేసారు.

తమ జనాభాను తగ్గించి చూపే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పల్స్ సర్వేలో తమ జనాభాను బాగా తగ్గించి చూపటంతోనే రిజర్వేషన్ శాతం తగ్గిపోయినట్లు ముద్రగడ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాపు జనాభా సుమారు కోటికి పైగా ఉండగా, ముఖ్యమంత్రి మాత్రం కాపు, ఒంటరి, బలిజలందరినీ కలిపి సుమారు 50 లక్షలుగా మాత్రమే చెబుతున్నారని మండిపడ్డారు. తమ జాతి ప్రయోజనాల కోసమే తాను రోడ్డుమీదకు వచ్చినట్లు చెప్పారు. 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు వర్తింప చేసినపుడే కాపులకు నిజమైన దీపావళిగా అభిప్రాయపడ్డారు. కాపులను బిసిల్లోకి చేర్చాలన్న తమ ఉద్యమానికి విరామం ఇచ్చామే కానీ విరమించలేదని స్పష్టంగా చెప్పారు.

 

click me!