ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

By narsimha lodeFirst Published Jun 13, 2019, 11:16 AM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఉదయం శాసనసభ .ప్రారంభమైన వెంటనే  తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ దాఖలైన నామినేషన్ పత్రాలను ప్రొటెం స్పీకర్ చదివి విన్పించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఉదయం శాసనసభ .ప్రారంభమైన వెంటనే  తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ దాఖలైన నామినేషన్ పత్రాలను ప్రొటెం స్పీకర్ చదివి విన్పించారు.  

నామినేషన్ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నందున తమ్మినేని సీతారాం ఏకగ్రీవరంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు  ప్రకటించారు. తమ్మినేని సీతారాం ఎన్నికైనట్టుగా ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు మంత్రులు ఆయనను అభినందించారు. 

తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్‌తో పాటు టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడులు స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. తమ్మినేనిని పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వచ్చి అభినందించారు.
 

click me!