ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే సీజ్

Published : Jun 13, 2019, 11:05 AM IST
ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడిపితే సీజ్

సారాంశం

 ఫిట్‌నెస్ ‌లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను నడిపే వాళ్లు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పారు.  

అమరావతి: ఫిట్‌నెస్ ‌లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని ఏపీ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను నడిపే వాళ్లు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పారు.

గురువారం నాడు ఏపీ మంత్రి  పేర్నినాని మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఫిట్‌నెస్ లేని బస్సులను నడిపితే సీజ్ చేయాలని  సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫిట్‌నెస్ లేని బస్సుల సమాచారాన్ని తమకు తెలిపితే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని  ఆయన తెలిపారు.

స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ చేయించుకొనేందుకు ఇవాళ సాయంత్రం వరకు గడువు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.  ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిరిగితే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్య, రవాణ శాఖలు సంయుక్తంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై కేంద్రీకరించనున్నాయి.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే