తిరుపతి జిల్లాలోని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం కౌంటర్ కు చేరుకున్న వ్యక్తి గుండెపోటుకు గురయి మృతిచెందాడు.
తిరుపతి : కుటుంబసభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనానికి వెళ్లి ఆ ఏడుకొండలపైనే ఓ భక్తుడు ప్రాణాలు వదిలాడు. స్వామివారి సన్నిధిలోని లడ్డూ ప్రసాదం కౌంటర్లో వుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయి కుప్పకూలిన భక్తుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దైవదర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన కే.గోపాల్ (58) కుటుంబసమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. శనివారమే తిరుమలలోని ఏడుకొండలపైకి చేరుకున్న ఈ కుటుంబం ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్లిన గోపాల్ తీసుకునేందుకు క్యూలో నిల్చున్నాడు. ఈ సమయంలోనే అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే టిటిడి సిబ్బంది సహకారంతో కుటుంబసభ్యులు అశ్విని హాస్పిటల్ కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. హాస్పిటల్ కు చేరుకునేలోపే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.
undefined
Read More తిరుమల వేంకటేశ్వర స్వామి ఆస్తులు ఎన్ని రూ. కోట్లో తెలుసా?
స్వామివారి దర్శనానికి వచ్చిన కుటుంబం దు:ఖంలో మునిగిపోవడంతో వారికి సాయం అందించి మానవత్వం చాటుకుంది టిటిడి. మృతదేహంతో పాటు కుటుంబసభ్యులను తమ స్వస్ధలానికి తరలించేందుకు టిటిడి అధికారులే వాహనాన్ని ఏర్పాటుచేసారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ఆయన సన్నిధిలోనే ప్రాణాలు కోల్పోయవడంపై టిటిడి అధికారులు విచారం వ్యక్తం చేసారు.