జగన్ పాదయాత్రలో సూర్య (వీడియో)

First Published 17, Jan 2018, 12:31 PM IST
Highlights
  • బుధవారం మరో విషయం చెప్పారు.

వైసిపి శ్రేణులు ఫుల్లు ఖుషీ అయ్యే వార్త ఇది. ఎందుకంటే, ఓ ప్రముఖ సినీహీరో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటానని చెప్పినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో హీరో సూర్యా అంటే తెలీని వాళ్ళెవరూ ఉండరు. అటువంటి సూర్య-జగన్ మధ్య గట్టి స్నేహబంధమే ఉంది. అందుకనే, మొన్ననే పాదయాత్ర గురించి సూర్య మాట్లాడుతూ జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మళ్ళీ బుధవారం మరో విషయం చెప్పారు.

ఇంతకీ అదేమిటంటే, త్వరలో జగన్ ను పాదయాత్రలో వెళ్ళి కలుస్తారని చెప్పారు. అంతేకాకుండా పాదయాత్రలో జగన్ తో పాటు తాను కూడా పాల్గొంటానని చెప్పారు. ఇంకేముంది సూర్య చెప్పిన తాజా కబురుతో వైసిపి శ్రేణులు సంబంరపడిపోతున్నాయి. వైసిపి సంబరానికి కారణమేమిటంటే, సినీ ప్రముఖుల్లో ఎక్కువమంది టిడిపిలోనే ఉన్నారు. ఏదో సందర్భం వచ్చినపుడు మాత్రం జగన్ ను కలుస్తున్నారు. విజయచందర్ లాంటి ఒకరిద్దరు వైసిపిలో ఉన్న విషయం అందరకి తెలిసిందే. అటువంటిది ఓ అగ్ర హీరో నుండి బహిరంగంగా జగన్ కు మద్దతు లభించేటప్పటికి వైసిపి నేతలు తెగ ఆనందపడిపోతున్నారు.

తమిళ హీరో సూర్యకి, వైస్సార్ ఫ్యామిలీ కి మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. వైస్సార్ బతికి ఉన్నప్పుడు సూర్య తరచూ జగన్ ను కలిసేవాడట. అదే విషయాన్ని స్వయంగా సూర్యానే ట్విట్టర్ లో చెప్పారు.  జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని మొన్ననే ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు.

జగనన్న చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజయం కావాలని కోరుకుంటున్నాని అన్నారు. జగనన్న ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనలో ఉంటాడు. నిరంతరం అదే ఆలోచన. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో, నేను చదువుకుంటున్న సమయంలో జగనన్న ఇంటికి చాలాసార్లు వెళ్లాను. నాకు ఆ వైఎస్ఆర్ కుటుంబంపై దగ్గరి సంబంధాలే ఉన్నాయి. కష్టపడే తత్వం జగనన్నలో ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లోనే జగన్ అంటే నాకు ఇష్టం అంటూ సూర్య చెప్పారు.  

 

 

Last Updated 25, Mar 2018, 11:47 PM IST