కేసీఆర్ సీఎం కావడానికి కారణం నేనే.. స్వరూపానందేంద్ర స్వామి

Published : Feb 18, 2019, 10:44 AM IST
కేసీఆర్ సీఎం కావడానికి కారణం నేనే.. స్వరూపానందేంద్ర స్వామి

సారాంశం

టీడీడీ అధికారులపైనా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైన కేసు పెడతానని హెచ్చరించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో పాలన లోపభూయిష్టంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర  సరస్వతీ మహాస్వామి ఆరోపించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని.. వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని.. వాటిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతానని ఆయన అన్నారు.

టీడీడీ అధికారులపైనా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైన కేసు పెడతానని హెచ్చరించారు. వీరిపై కోర్టులో కేసు కూడా వేస్తానని ఆయన అన్నారు.  గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి రిలీజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్య మంత్రి అవ్వడానికి తానే కారణమన్నారు. తాను దగ్గర ఉండి మరీ కేసీఆర్ చేత రాజశ్యామల యాగం చేయించానని.. అందుకే సీఎం అయ్యారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వం మారడం కోసం త్వరలో తాను మరో రాజశ్యామల యాగం చేస్తానని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu