మాజీ ఎమ్మెల్యే కొడుకును చితకబాదిన ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు

Published : Feb 18, 2019, 10:43 AM IST
మాజీ ఎమ్మెల్యే కొడుకును చితకబాదిన ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు

సారాంశం

గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు దౌర్జన్యం చేయడంతో మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు తనయుడు ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు


గుంటూరు:గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు దౌర్జన్యం చేయడంతో మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు తనయుడు ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రిలో  చేర్పించారు. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని  మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు కుటుంబసభ్యులు కోరుతున్నారు.

గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లిఖార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కొడుకు ఆదినారాయణకు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులకు మధ్య వివాదానికి దారి తీసింది.

ఈ విషయమై ఆదినారాయణపై టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో ఆయన మనోవేదనకు గురయ్యాడు.  దీంతో  ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యరపతినేని  వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని  వారు ఆందోళన వ్యక్తం చేశారు.

తమ క్వారీని యరపతినేని అనుచరులు బలవంతంగా లాక్కొన్నారని వారు ఆరోపించారు. ఆదినారాయణ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే  టీడీపీ నేతలు కూడ వారిని లాక్కెళ్లారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?