లాస్ట్ బెంచ్‌లో.. చున్నీల చాటున: మందు కొట్టిన అమ్మాయిలు

Siva Kodati |  
Published : Feb 18, 2019, 10:32 AM IST
లాస్ట్ బెంచ్‌లో.. చున్నీల చాటున: మందు కొట్టిన అమ్మాయిలు

సారాంశం

తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు కొద్ది రోజులుగా కూల్‌డ్రింకులో మద్యం కలిపిన సీసాలను బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. చివరి బెంచ్‌లో కూర్చొని, చున్నీల చాటున ఎవరికీ కనిపించకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. 

మందుకొట్టి పాఠశాలకు వస్తున్న ఇద్దరు విద్యార్థులను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. వివరాల్లోకి వెళితే.. విజయవాడ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు కొద్ది రోజులుగా కూల్‌డ్రింకులో మద్యం కలిపిన సీసాలను బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు.

చివరి బెంచ్‌లో కూర్చొని, చున్నీల చాటున ఎవరికీ కనిపించకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. శనివారం ఉదయం బ్రేక్ సమయంలో ఫుల్లుగా మద్యం సేవించారు. పక్కన కూర్చొన్న.. అయితే మత్తులో తోటి విద్యార్థినులపై తూలడంతో పాటు నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చిన మిగిలిన విద్యార్ధినులు హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వారిని పిలిపించిన ప్రధానోపాధ్యాయుడికి బాలికల నుంచి మద్యం వాసన రావడంతో వైద్యులతో పరీక్ష చేయించారు. బాలికలు మద్యం తాగినట్లు డాక్టర్లు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే తల్లిదండ్రులను పిలిపించి, వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు.

వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చారు. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో.. సీసాలో మిగిలిన దానిని రుచి చూస్తూ.. దానిని అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో తోటి విద్యార్థులు చెడిపోయ్యే ప్రమాదం ఉన్నందున వారి సమక్షంలో బాలికలకు టీసీలు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

JC Prabhakar Reddy Funny comments: ప్రజలతో జేసీ ప్రభాకర్ రెడ్డి పంచ్ లు | Asianet News Telugu
AP Food Commission Chairman Warning: ఈ చిల్లర పంచాయితీలు మానేయండి | Chitha Vijay Prathap Reddy