స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం: అన్నింటికీ కారణం రమేశ్ ఆసుపత్రే.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక

By Siva KodatiFirst Published Aug 19, 2020, 6:17 PM IST
Highlights

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రమేశ్ ఆసుపత్రి అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రమేశ్ ఆసుపత్రి అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది.

ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదని... డబ్బు సంపాదనే ధ్యేయంగా నిబంధనలను రమేశ్ ఆసుపత్రి పట్టించుకోలేదని నివేదికలో వెల్లడించింది. పది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం రమేశ్ ఆసుపత్రేనని, కరోనా నెగిటివ్ వచ్చిన వారిని కూడా చేర్చుకున్నారని కమిటీ పేర్కొంది.

కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని తెలిపింది. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక ప్రమాణాలు ఉన్నాయా..? లేవా..? చూసుకోకుండా కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారని కమిటీ చెప్పింది. కోవిడ్ సోకిందన్న సోకిందన్న అనుమానం వున్న వారిని, సోకని వారని ఆసుపత్రిలో ఒకే చోట చేర్చుకున్నారని విచారణ కమిటీ పేర్కొంది. 

click me!