గల్లా జయదేవ్ లేఖ: అమరావతిపై సర్వేయర్ జనరల్ సంచలన రిప్లై

By telugu teamFirst Published Aug 19, 2020, 3:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సర్వేయర్ జనరల్ ఆప్ ఇండియా స్పష్టత ఇచ్చింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాసిన లేఖకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ సమాధానం ఇచ్చారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాసిన లేఖకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా కీలకమైన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి గల్లా జయదేవ్ కు లేఖ అందింది. 

భారతదేశం పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చామని డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ జయదేవ్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆమోదం మేరకే లేఖను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరుడు విడుదల చేసిన భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదంగా మారింది. 

ఇండియా మ్యాప్ లో అమరావతి పేరును చేర్చకపోవడాన్ని గల్లా జయదేవ్ 2019 నవంబర్ 21వ తేీదన లోకసభ జీరో అవర్ లో ప్రస్తావించారు. అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలనే కాకుండా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీని అవమానించినట్లేనని ఆయన అన్నారు. అమరావతితో కూడిన పటాన్ని విడుదల చేయాలని ఆయన కోరారు. 

ఆ మర్నాడే అమరావతితో కూడిన ఇండియా మ్యాప్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ పటాన్ని కూడా దానికి జతచేశారు. ఈ విషయంపై ఇప్పుడు సర్వేయర్ జనరల్ ఆప్ ఇండియా గల్లా జయదేవ్ రాసిన లేఖపై స్పష్టత ఇచ్చింది.

click me!