మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్టే ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది మే 5వ తేదీ లోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పూర్తి కానుందున జూలై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ఉత్తర్వులపై ఈ నెల 16న వైఎస్ సునతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సునీతా రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
undefined
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14న తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ఏ 1 నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును అప్పట్లో సిట్ విచారించింది. అయితే సకాలంలో చార్జీషీట్ దాఖలు చేయలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
also read:ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులు: సుప్రీంలో వైఎస్ సునీతా పిటిషన్
ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. అయితే జూలై 1న బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంపై వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది.