చంద్రబాబుకు షాక్

First Published Mar 6, 2017, 5:55 AM IST
Highlights

నూతన అసెంబ్లీ భవనంలో బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే కోర్టు చంద్రబాబు నోటీసులు ఇవ్వాలని ఆదేశించటం గమనార్హం.

సుప్రింకోర్టు చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చింది. ఓటుకునోటు కేసును విచారణకు స్వీకరించింది. దాదాపు ఏడాదిన్నరగా ఓటుకునోటు కేసులో ఎటువంటి విచారణను జరగకుండా తీవ్రంగా అడ్డుకుంటున్న చంద్రబాబుకు కోర్టు నిర్ణయం పెద్ద షాకే. కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ బాలకృష్ణన్ ధర్మాసనం ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనంలో బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే కోర్టు చంద్రబాబు నోటీసులు ఇవ్వాలని ఆదేశించటం గమనార్హం.

 

తెలంగాణాలో ఏడాదిన్న క్రితం జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును రూ. 5 కోట్లకు టిడిపి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ ఇచ్చే నేపధ్యంలో స్టీఫెన్ ఇంట్లో టిటిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి డబ్బు కట్టలతో పట్టుబడ్డారు. అంతేకాకుండా స్టీఫెన్ తో ఓటు విషయంలో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా బయటపడ్డాయి. దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

 

పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను చంద్రబాబు అర్ధాంతరంగా వదిలేయటానికి ఈ కేసే ప్రధానం. కేసులో ఏసిబి అధికారులు ఇద్దరు ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను అరెస్టు చేసినా చంద్రబాబు పాత్రమీద మాత్రం విచారణ సాధ్యం కాలేదు. ఎందుకంటే, తన పాత్రపై విచారణ జరపటానికి వీల్లేదంటూ చంద్రబాబు కోర్టుల్లో స్టే తెచ్చుకున్నారు. అయితే, ఈ కేసులో చంద్రబాబు పాత్ర తేలాలంటే సిఎంను కూడా విచారించాల్సిందేనంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఎంత పోరాటం చేసినా ఉపయోగం లేకపోయింది. దాంతో సుప్రింకోర్టును ఆశ్రయించారు. అదే కేసును ఈరోజు పరిశీలించిన సుప్రింకోర్టు ఓటుకునోటు కేసులో చంద్రబాబును విచారించాల్సిందేనంటూ నిర్ణయించింది. ఆ మేరకు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది.  

click me!