
సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబునాయుడు ఎంఎల్సీ అభ్యర్ధులను ఖరారు చేసారు. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్ధులపై కుల, ప్రాంతీయ సమీకరణలను ఎన్నింటినో సిఎం భేరీజు వేసుకున్నారు. ఎందరో సీనియర్లు పోటీ పడినప్పటికీ చంద్రబాబు ఆచి తూచి నలగురిని ఎంపిక చేసారు. ఐదు స్ధానాల్లో చాలా రోజుల క్రితమే కొడుకు నారా లోకేష్ ను ఎంపిక చేసిన చంద్రబాబు మిగిలిన నాలుగు పేర్లను ఆదివారం అర్ధరాత్రి ఖరారు చేసారు.
కృష్ణా జిల్లా నుండి బచ్చుల అర్జునుడు, గుంటూరు జిల్లా నుండి డొక్యా మాణిక్య వరప్రసాద్, ప్రకాశం జిల్లా నుండి కరణం బలరాం, పోతుల సునీతలను ఖరారు చేసారు. మంగళవారా నామినేషన్లు దాఖలకు చివరి రోజు కావటంతో అభ్యర్ధులంతా సోమవారమే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలున్నాయి. లోకేష్ మాత్రం ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నారు. ఐదుగురు అభ్యర్ధులనే ఖరారు చేయటంతో 6వ అభ్యర్ధికి పోటీ పెట్టే విషయాన్ని చంద్రబాబు పక్కకు పెట్టేసినట్లే.