విశాఖలోని రుషికొండలో రిసార్ట్స్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసు విచారణను పూర్తి చేసింది. మరో వైపు ఈ విచారణను త్వరగా పూర్తి చేయాలని కూడా ఏపీ హైకోర్టుకు ఆదేశించింది.
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలోని Rushikondaలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్తగా తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రుషికొండలో తవ్వకాలపై Supreme Court లో బుధవారం నాడు విచారణ నిర్వహించింది. రుషికొండ తవ్వకాలపై NGT లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ మే 6న ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌జీటీ నిర్ణయాన్ని Andhra Pradesh ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఈ విషయమై సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ , జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసం విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు విన్పించారు.
undefined
రుషికొండలో ఆరు ఎకరాలు ఉండగా 8.2 ఎకరాల్లోనే నిర్మాణాలున్న విషయాన్ని సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో Resorts ఉన్న ప్రాంతంతో పాటు మరింత విస్తరిస్తామన్నారు. రుషికొండ విస్తరణ విషయమై సింఘ్వితో సుప్రీంకోర్టు ధర్మాసనం విబేధించింది. గతంలో రిసార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది.
రుషికొండను తవ్వారని Raghuramakrishnam Raju న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రుషికొండ తాజా ఫోటోలను ఆయన ధర్మాసనం ముందుంచారు. ఇదే విషయమై AP High Courtలో ధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉందని కూడా రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది చెప్పారు. నిర్మాణాలకు అనుమతిస్తే పర్యావరణ ముప్పులేకుండా చేపడుతారా ప్రశ్నించింది. అయితే అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపడుతామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా అందరూ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎన్జీటీ అవసరమనుకొంటే హైకోర్టు మరో నిపుణుల కమిటీని కూడా నియమించుకోవచ్చని కూడా సూచించింది.తన వాదనలను హైకోర్టులోనే చెప్పాలని రఘురామకృష్ణంరాజుకు సూచించింది సుప్రీంకోర్టు. దీనిపై విచారణను తర్వగా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు.