కర్నూల్ జిల్లా వెల్దుర్తిలో ఉద్రిక్తత: రోడ్డుకు అడ్డంగా నిర్మాణం, ఇరువర్గాల ఘర్షణ

Published : Jun 01, 2022, 02:37 PM ISTUpdated : Jun 01, 2022, 02:43 PM IST
కర్నూల్ జిల్లా వెల్దుర్తిలో ఉద్రిక్తత: రోడ్డుకు అడ్డంగా నిర్మాణం, ఇరువర్గాల ఘర్షణ

సారాంశం

కర్నూల్ జిల్లాలోని వెల్దుర్తిలో రోడ్డుకు అడ్డంగా గోడ అడ్డంగా నిర్మించడంతో  ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయమై గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. 

కర్నూల్:  జిల్లాలోని Veldurthiలో బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన Wall నిర్మాణం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇరువర్గ్గాలను చెదరగొట్టారు.

వెల్ధుర్తిలోని అరకల వీధిలో ఈ విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. మూడేళ్లుగా ఈ వివాదం నడుస్తుంది.  తమ వీడికి వెళ్లే దారిలో YCP  నేత Sameer Reddy గోడ నిర్మిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గోడ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 10 రోజుల క్రితం కూడా  గొడవ జరిగింది. మద్యం సీసాలు,సిమెంట్ ఇటుకలతో వైసీపీ నేత సమీర్ రెడ్డి అనుచరులు తమపై దాడికి దిగారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.  వైసీపీ నేత కాబట్టే తమపై పోలీసులు కేసు నమోదు చేశారని కాలనీవాసులు ఆరోపణలు చేస్తున్నారని ఎన్టీవీ ప్రసారం చేసింది.

వెల్ధుర్తి ఘటనపై నారా లోకేష్ ఫైర్

వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని లోకేష్ విమర్శించారు.. బుధవారం మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి అనకాల వీధికి అడ్డంగా వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి  గోడ కడుతుండగా స్థానికులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక వారిపైనే దాడిచేయడం దారుణమని మండిపడ్డారు. 

మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల  రాక్షసప్రవృత్తికి నిదర్శనమన్నారు. నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేమిటని  ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? అని ప్రశ్నించారు. సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్