జగన్ సర్కార్‌కి సుప్రీం షాక్: అమరావతి భూముల్లో ఇన్‌‌సైడర్ ట్రేడింగ్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత

By narsimha lode  |  First Published Jul 19, 2021, 4:50 PM IST

 అమరావతి భూముల్లో ఇన్‌సైడర్  ట్రేడింగ్ పై ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.


న్యూఢిల్లీ: అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని  ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టేసింది. గతంలో ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

&n

అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టేసింది. గతంలో ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. pic.twitter.com/cyMx9dwFml

— Asianetnews Telugu (@AsianetNewsTL)

Latest Videos

bsp;

 

సోమవారం నాడు జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం  ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు  జరిగాయి.  అమరావతి భూముల విక్రయంలో ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఏపీ హైకోర్టు ఇచ్చిన వాదనలతో తాము ఏకీభవిస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తోందని ముందే తెలుసుకొని ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ముందుంచారు. వీరంతా కూడ  అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సన్నిహితులు అని  ఆయన చెప్పారు. ఆరేళ్ల తర్వాత ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారని సుప్రీకోర్టు ప్రశ్నించింది. అయితే 2019లో ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. విజయవాడ గుంటూరు ప్రాంతంలో రాజధాని వస్తోందని మీడియాలో వచ్చిన వార్తలను  భూములను కొనుగోలు చేసిన వారి తరపు న్యాయవాదులు విన్పించారు. ఈ విషయమై పార్లమెంట్ లో కూడ చర్చ జరిగిందని కూడ వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఏపీ ప్రభుత్వ  తరపు న్యాయవాది వాదనలను  భూములు కొనుగోలు చేసిన తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. పబ్లిక్ డొమైన్‌లోనే  రాజధాని ఎక్కడ వస్తోందో కూడ బహిరంగంగానే ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఏపీ సీఎం  ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే  చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను  కూడ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాలు వాదనలు విన్న తర్వాత ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

click me!