ఆ నిధులు రెండు వారాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో జమ చేయండి: ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

Published : Jul 18, 2022, 01:53 PM ISTUpdated : Jul 18, 2022, 04:44 PM IST
 ఆ నిధులు రెండు వారాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో జమ చేయండి: ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

సారాంశం

కోవిడ్ నిధులను పక్కదారి పట్టించిన అంశంలో సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

కోవిడ్ నిధులను పక్కదారి పట్టించిన అంశంలో సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పీడీ ఖాతాలకు మళ్ళించిన కొవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 1,100 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. అయితే నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్దమని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేశారు. 

ఇక, కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో ఫిర్యాదును పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కోవిడ్ నిధుల మళ్లింపుపై గతంలో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్