ఆస్తుల కేసు: చంద్రబాబుకు ఊరట, లక్ష్మీపార్వతికి షాక్

Published : Sep 09, 2022, 12:03 PM ISTUpdated : Sep 09, 2022, 12:09 PM IST
ఆస్తుల కేసు: చంద్రబాబుకు ఊరట, లక్ష్మీపార్వతికి షాక్

సారాంశం

చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద వైసీపీ నేత లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అని ప్రశ్నించింది. 

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్ ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 

ఇదిలా ఉండగా, గతనెల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి తను చనిపోయే ముందు లేఖ రాసిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఆగస్ట్ మూడున ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ ప్రదేశానికి చంద్రబాబు నాయుడు వెళ్లాక ఆ లేఖ మాయమైందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు. 

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో లక్ష్మీపార్వతి... సీఎం జగన్, చంద్రబాబు లపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఉమా మహేశ్వరి మృతి వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆగస్ట్ 1వ  తేదీన ఉమామహేశ్వరి హైద్రాబాద్ లోని తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తెల్లారి మధ్యాహ్నం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఆమె కూతురు, అల్లుడు కూడా ఉన్నారు. కూతురు దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీక్షిత ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, ఈ యేడాది జనవరిలో లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడాను. జీవితా రాజశేఖర్ లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో  మాట్లాడించారు.  

ఎన్టీఆర్ ఆత్మ పదహారేళ్ల అమ్మాయిలో ప్రవేశించి అనేక విషయాలు పంచుకుంది అంటూ లక్ష్మీపార్వతి, సంచలన విషయం వెల్లడించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు గురించి మాట్లాడుతూ ఆ పని ఎవరు చేసినా తప్పే అని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీపార్వతి కితాబు నిచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానన్నారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీపార్వతి కోరారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు