అమరావతిపై సుప్రీంలో జగన్ సర్కార్ కు చుక్కెదురు: ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరణ

By narsimha lodeFirst Published Mar 28, 2023, 5:26 PM IST
Highlights

అమరావతి  రాజధానిపై ఏపీ హైకోర్టు  ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు నిరాకరించింది.   ఈ ఏడాది జూలై 11న  ఈ పిటిషన్లపై  విచారణ  చేయనున్నట్టుగా  సుప్రీంకోర్టు  తెలిపింది. 


న్యూఢిల్లీ: అమరావతి  రాజధానిపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై స్టే  ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు నిరాకరించింది.  మరో వైపు  అమరావతి  రాజధాని అంశంపై  ఏపీ ప్రభుత్వం  దాఖలు  చేసిన పిటిషన్లను  త్వరగా విచారించాలని  సుప్రీంకోర్టును  ఏపీ ప్రభుత్వ  న్యాయవాదులు కోరారు. అయితే  ఏపీ సర్కార్ అభ్యర్ధనను   సుప్రీంకోర్ట తోసిపుచ్చింది.  

సుప్రీంకోర్టుకు చెందిన  జస్టిస్ కేఎం జోసెఫ్,  జస్టిస్  బీవీ నాగరత్నల దర్మాసనం  ఇవాళ  విచారించింది.  అమరావతి రాజధాని అంశంపై  ఏపీ హైకోర్టు  ఇచ్చిన  తీర్పుపై పూర్తిస్థాయిలో  స్టే  ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు  నిరాకరించింది.  ఈ విషయమై  ఇప్పటికిప్పుడే  విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం  తేల్చి  చెప్పింది.  

Latest Videos

వేసవి సెలవుల తర్వాత  ఈ పిటిషన్లపై  విచారణ  చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ  న్యాయవాదులకు తెలిపింది.అంతకంటే  ముందుగానే  ఈ పిటిషన్లపై విచారణ  చేయాలని  ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే  అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం అంగీకరించలేదు.  జూలై  11న  ఈ పిటిషన్లపై తొలుత విచారణ  చేపడుతామని  సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 

 ఈ పిటిషన్లలో  అనేక మంది భాగస్వామ్యులు ఉన్నందున అందరిని విచారించాల్సి  ఉందని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  అమరావతిలో  నిర్ణీత  కాల వ్యవధిలో  నిర్మాణాలను  పూర్తి  చేయాలని  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే  కొనసాగుతుందని  సుప్రీంకోర్టు తేల్చి  చెప్పింది.  అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన పూర్తి తీర్పుపై  మాత్రం స్టేకి  నిరాకరించింది  సుప్రీంకోర్టు.  అమరావతి రాజధానిపై పిటిషన్లు దాఖలు  చేసి మరణించిన రైతుల స్థానంలో  తాము ప్రతివాదులుగా  చేరుతామని  కొందరు  రైతులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు  సుప్రీంకోర్టు అంగీకరించింది.  ప్రతివాదులుగా  చేరేందుకు  ముందుకు  వచ్చిన  రైతులకు  నోటీసులు  జారీ  చేయాలని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. 

click me!