వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్ పై విచారణ ఈ నెల 13కి వాయిదా

By narsimha lodeFirst Published Jun 9, 2023, 12:31 PM IST
Highlights

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై స్టే కోరుతూ వైఎస్ సునీతా రెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ పై  విచారణను  ఈ నెల  13కి వాయిదా వేసింది  సుప్రీంకోర్టు. 

న్యూఢిల్లీ: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే  ఇవ్వాలని  కోరుతూ  వైఎస్ సునీతారెడ్డి  దాఖలు  చేసిన  పిటిషన్ పై విచారణను  ఈ నెల  13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇవాళ  ఉదయం  సుప్రీంకోర్టులో  వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు విన్పించారు.వివేకానందరెడ్డి హత్య  కేసులో  వైఎస్ అవినాష్ రెడ్డి   ప్రధాన కుట్రదారు అని  వైఎస్ సునీతా రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. స్థానిక  ప్రభుత్వం కూడ అవినాష్ రెడ్డికే మద్దతిస్తుందని  సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.  సీబీఐ విచారణను  వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని  సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే  ఈ పిటిషన్ పై  విచారణను  ఈ నెల  13వ తేదీకి  వాయిదా వేసింది  సుప్రీంకోర్టు.

also read:కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్: సుప్రీంలో వైఎస్ సునీతా రెడ్డి సవాల్

 ఈ ఏడాది మే  31వ తేదీన తెలంగాణ హైకోర్టు  కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  తెలంగాణ హైకోర్టు  వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను  మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఈ నెల  7వ తేదీన   సవాల్  చేశారు. తాను  దాఖలు  చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ  జరిపేలా  తెలంగాణ హైకోర్టు  వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని  వైఎస్ అవినాష్ రెడ్డి  సుప్రీంకోర్టులో  ఈ ఏడాది మే  22న  పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై  మే  25న  విచారణ  జరపాలని  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను  సుప్రీంకోర్టు ఆదేశించింది.   ఈ పిటిషన్ పై  అన్ని వర్గాల వాదనలు విన్న  హైకోర్టు  ఈ ఏడాది మే 31వ తేదీన  వైఎస్ అవినాష్ రెడ్డికి  ముందస్తు బెయిల్ ఇచ్చింది.

2019  మార్చి 14న పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకు గురయ్యాడు.ఈ కేసును సీబీఐ  విచారిస్తుంది.  ఈ నెల  30వ తేదీలోపుగా  ఈ కేసు విచారణను  పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు  ఇప్పటికే  ఆదేశించిన విషయం తెలిసిందే.   అయితే  ఈ నెలాఖరు వరకు  ఈ కేసు విచారణను  పూర్తి చేసేందుకు  సీబీఐ  ప్రయత్నాలు  చేస్తుంది. 
 

click me!