తిరుమల ఆలయం మీదుగా వెళ్లిన విమానం: టీటీడీ అధికారుల ఆరా

Published : Jun 09, 2023, 10:30 AM ISTUpdated : Jun 09, 2023, 11:00 AM IST
 తిరుమల  ఆలయం మీదుగా    వెళ్లిన విమానం:  టీటీడీ అధికారుల ఆరా

సారాంశం

తిరుమల కొండపై   ఇవాళ  ఉదయం  ఓ విమానం ఎగురుతూ  కన్పించింది.  ఈ విషయమై  టీటీడీ  అధికారులు   ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

తిరుమల: తిరుమల దేవాలయం మీదుగా  శుక్రవారంనాడు ఓ విమానం వెళ్లింది.  ఈ విషయమై అధికారులు  విచారణ  చేస్తున్నారు.  తిరుమల  అన్న ప్రసాదం మీదుగా  విమానం  వెళ్లింది.   తిరుమల కొండ ప్రాంతాన్ని  నో ఫ్లై జోన్ గా  గుర్తించాలని  టీటీడీ  కేంద్రాన్ని కోరింది. అయితే  ఈ విషయమై  కేంద్ర ప్రభుత్వం నుండి  ఇంకా  స్పష్టత  రావాల్సి ఉంది.   తిరుమల దేవాలయంపై  నుండి   విమానాలు వెళ్లకుండా  చూడాలని  టీటీడీ  విమానాయానశాఖను కోరింది. కానీ  ఇటీవల  కాలంలో  తరచుగా  విమానాలు, హెలికాప్టర్లు  తిరుమల  ఆలయం మీదుగా  ప్రయాణించడంపై   భక్తులు  ఆందోళన చెందుతున్నారు.

 నెల రోజుల వ్యవధిలో  మూడోసారి  విమానాలు  చక్కర్లు  కొట్టడంపై  భక్తులు  ఆందోళన  చెందుతున్నారు.  ఆలయంపై నుండి విమానాలు వెళ్లిన సమయంలో  టీటీడీ  అధికారులు  విమానాయానశాఖకు ఫోన్  చేసి  వివరాలు తెలుసుకుంటున్నారు. 

ఆగమ  శాస్త్ర ప్రకారంగా తిరుమల ఆలయంపై నుండి విమానాలు, హెలికాప్టర్లు వెళ్లొద్దు.  ఈ విషయమై     టీటీడీ  అధికారులు   విమానాయాన శాఖకు  విన్నవించింది.  తిరుమలను  నో ఫ్లై జోన్ గా  ప్రకటించాలని  టీటీడీ  కేంద్రాన్ని  కోరింది. ఇటీవల  కాలంలో  తరుచుగా  తిరుమల ఆలయంపై నుండి ఫ్లైట్స్,  హెలికాప్టర్లు తిరుగుతుండడం  కలకలకం రేపుతుంది.

ఈ ఏడాది  ఏప్రిల్  25వ తేదీన  తిరుమల దేవాలయం మీదుగా  మూడు హెలికాప్టర్లు  ప్రయాణించాయి.  అయితే  హూడు  హెలికాప్టర్లు  ఆర్మీకి  సంబంధించినవిగా  టీటీడీ అధికారులకు  సమాచారం అందింది. చెన్నైకి వెళ్లే తిరుమల ఆలయం మీదుగా  హెలికాప్టర్లు  ప్రయాణం చేసినట్టుగా  టీటీడీ అధికారులు  తమ దర్యాప్తులో  గుర్తించారు.  

ఈ ఘటన జరిగిన  కొన్ని  రోజులకే  జెట్ విమానం  ఆలయం పై నుండి వెళ్లింది. ఈ విషయమై   టీటీడీ అధికారులు  విమానాయాన శాఖ అధికారులతో మాట్లాడారు. తాజాగా మరో విమానం  తిరుమల ఆలయం గగనతలంపై నుండి వెళ్లింది.  ఈ విషయమై  టీటీడీ అధికారులు  విమానాయాన శాఖ అధికారులతో విచారిస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్