కారణమిదీ:ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

By narsimha lode  |  First Published Oct 11, 2023, 2:14 PM IST

ఓటుకు నోటు కేసులో విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సుప్రీం సమ్మతించింది.


న్యూఢిల్లీ:ఓటుకు నోటు కేసులో  విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసు  విషయమై రెండు పిటిషన్లను  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని  ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి  సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. 2017 లో  ఈ పిటిషన్లను ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు.

అయితే  ఈ కేసులో  చంద్రబాబు తరపున వాదించే సిద్దార్థ్ లూత్రా అందుబాటులో లేనందున  విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో  సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణను  నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా  తెలిపింది.

Latest Videos

undefined

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయంలో  ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి  డబ్బులిస్తూ  దొరికినట్టుగా అప్పట్లో ఏసీబీ ప్రకటించింది.  అయితే తనను ఉద్దేశ్యపూర్వకంగా  ఏసీబీ  ఈ కేసులో ఇరికించిందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  2021 మే 27న ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో చంద్రబాబు పేరు లేదు.

also read:తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు: చంద్రబాబుపై ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 4న సుప్రీంలో విచారణ

2015లో  తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు అవసరమైన ఓట్లను  కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచే క్రమంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని  ఏసీబీ అధికారులు  అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు.ఈ కేసులో రేవంత్ రెడ్డి  కొంత కాలం జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో లిస్టైంది.  అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు అందుబాటులో లేని విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తేవడంతో  విచారణను కోర్టు వాయిదా వేసింది. 

 

click me!