తండ్రి కోసమే లోకేష్ డిల్లీకి ... నీలా 'అరగంట' కోసం కాదుగా..: అంబటికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

By Arun Kumar P  |  First Published Oct 11, 2023, 12:43 PM IST

చంద్రబాబు అరెస్ట్... ఆయన కొడుకు గురించి కామెంట్స్ చేసిన మంత్రి అంబటి రాంబాబుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


గుంటూరు : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ తర్వాత వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇలా టిడిపి నాయకుడు అరెస్ట్ కు భయపడి దేశ రాజధాని డిల్లీకి పారిపోయాడన్న ప్రచారంపై మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ గా స్పందించాడు. అతడికి అంతే ఘాటుగా సమాధానం  ఇచ్చాడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. 

చంద్రబాబు అరెస్ట్ తర్వాత జాతీయపార్టీల మద్దతు, లాయర్లతో సంప్రదింపుల కోసమే లోకేష్ డిల్లీలో వుంటున్నట్లు టిడిపి అంటోంది. కాదు కాదు తండ్రి కంటే ఎక్కువ అవినీతికి పాల్పడిన తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయపడే లోకేష్ డిల్లీ పారిపోయాడని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 'తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యా పిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయిన పిరికి బడుద్ధాయి!'' అంటూ లోకేష్ ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సెటైర్లు వేసారు.  

Latest Videos

అంబటి లోకేష్ పై చేసిన కామెంట్స్ కు అదే ఎక్స్ వేదికన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''తండ్రి కోసమేగా వెళ్ళింది..."అరగంట కోసం" కాదుగా  సోం బేరి  సారు..'' అంటూ అంబటికి కౌంటర్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు. 

Read More  చంద్రబాబు, లోకేష్ దొరికిపోయారు .. పవన్ కిరాయి కోటిగాడు, మరిది కోసమే ఢిల్లీకి పురందేశ్వరి : అంబటి రాంబాబు

ఇక గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలోనూ లోకేష్ పై మంత్రి అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అసలు పచ్చగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాశనానికి లోకేష్  కారణమని... అతడు అడుగు పెట్టగానే ఆ పార్టీ పాతాళానికి వెళ్లిపోయిందన్నారు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని... ఇందులో టిడిపిని ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. టిడిపి మునిగిపోతున్న పడవ అని మంత్రి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం చేస్తాను అన్నావుగా... ఇప్పుడేంటి డిల్లీలో దాక్కుంటున్నావు అంటూ లోకేష్ ను ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకుని అవినీతి కేసుల నుండి భయటపడాలని లోకేష్ చూస్తున్నాడని అన్నారు. ఏం చేసినా అవినీతికి పాల్పడినవారు శిక్ష అనుభవించక తప్పదని అంబటి అన్నారు. 

ఈ ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వం తమదని అంబటి అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ తమను ఆశీర్వదిస్తారని... అయితే ప్రజల్లోకి వెళ్లి గతంలో కంటే మెరుగ్గా 175 కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. అందుకోసమే ఈ నెల 26 నుండి సామాజిక బస్సు యాత్రలకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి అంబటి తెలిపారు.

click me!