సీఎం, డీజీపీలు కలిసే దాడులు చేయించారు.. రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

Published : Oct 25, 2021, 01:47 PM ISTUpdated : Oct 25, 2021, 01:50 PM IST
సీఎం, డీజీపీలు కలిసే దాడులు చేయించారు.. రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి తమ పార్టీలపై దాడులు జరిపించారని, రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులను, తమ పార్టీ నేతలపై నిర్బంధాలను సీబీఐతో దర్యాప్తు చేయించాలని, అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు.  

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత Chandrababu Naidu ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి President Ramnath Kovindhను కలిశారు. అనంతరం Delhiలోనే ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల్లేవని, మాట్లాడే హక్కుల్లేవని, ప్రశ్నించే హక్కులూ లేవని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీలు కలిసే ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నారని, తమ పార్టీ కార్యాలయాలపై అలాంటి Terrorismతోనే దాడులు జరిపించారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు వెల్లడించారు.

సంక్షేమ చర్యల్లో, పురోగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్థానంగా వెలుగొందిందని, ఇప్పుడు YCP అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలు సిగ్గుపడే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా, ఎవరూ డ్రగ్స్ గురించి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మద్యపానం నిషేధించాల్సి పోయి దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మిస్తున్నదని తెలిపారు. వైసీపీ అనుయాయులతో ఆ లిక్కర్ తయారు చేయించి ప్రభుత్వ సహకారంతో విక్రయాలు జరిపిస్తున్నదని మండిపడ్డారు. యువత ఒక్కసారి ఈ మాదకద్రవ్యాల బారిన పడితే దానికి బానిసలు అవుతారని, తద్వారా వారు ఉగ్రవాదులు,
గ్యాంగ్‌స్టర్లు, రౌడీలు, ముఠాలుగా మారే ప్రమాదముందని అన్నారు. అందుకే డ్రగ్స్‌పై తాము గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశామని వివరించారు.

Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులు: మరో అరుగురి అరెస్ట్.. మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు

అందుకే TDPని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని పార్టీ హెడ్‌క్వార్టర్ సహా విశాఖపట్నం, నెల్లూరు ఇంకా పలుచోట్ల ఆఫీసు కార్యాలయాలపై వరుసగా దాడులు జరిపించారని వివరించారు. తమ పార్టీ డీజీపీ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్నదని, పక్కనే సీఎం నివాసమున్నదని తెలిపారు. దాడి విషయం తెలియగానే తాను డీజీపీకి ఫోన్ చేశారని, తమ పార్టీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు. తాను స్వయంగా దాడి జరిగిన కార్యాలయం దగ్గరకు వెళ్తే అక్కడ దాడి చేసినవారిని పోలీసులు దగ్గర ఉండి పంపించే పరిస్థితులు కనిపించాయని ఆరోపించారు.

Also Read: వైసిపి దాడులపై కేంద్రానికి ఫిర్యాదు... డిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ స్పాన్సర్డ్ అంటే ప్రభుత్వ ఉగ్రవాదమే నడుస్తున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం, డీజీపీ కలిసి గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిపించారని తెలిపారు. ఇదేమిటని అడిగిన తమ పార్టీనేతలపైనే కేసులు బనాయించారని, నిర్బంధించారని చెప్పారు. టీడీపీ ఆఫీసులపై దాడులు, టీడీపీ నేతలపై నిర్బంధాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించడానికి చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu