ఈయన చెల్లని నోటా!

Published : Nov 16, 2016, 08:25 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఈయన చెల్లని నోటా!

సారాంశం

ప్రత్యేక హోదా కాదని  ప్రత్యేక ప్యాకేజీ కోసం పరిగెత్తడం వెనక రహష్యం:  ప్రత్యేక ప్యాకేజీ వస్తే,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కుమారుడులోకేశ్ బాబుకు, సుజనా చౌదరికి కమిషన్లు వస్తాయి - జోగి రమేష్

కేంద్రమంత్రి సుజనా చౌదరి చెల్లని మంత్రి అని వైఎస్ఆర్ సి అధికార ప్రతినిధి  ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. 

 

ప్రత్యేక హోదా చెల్లని నోటుఅని కేంద్ర మంత్రి అనడం మీద  రమేష్ తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. చౌదరి చెల్లని మంత్రి  ఎలా అయ్యారో అయన వివరణ ఇచ్చారు.

 

’ప్రత్యేక హోదా అదిగో వస్తాంది, ఇది వస్తాంది. తయారవుతా వుంది. ప్రత్యేక విమానంలో వస్తావుందని చెప్పి రెండున్నరేళ్ల కాలయాపన చేశారు. ప్రగల్భాలు పలికింది నువ్వు. ఇపుడేమో ప్రత్యేక హోదా చెల్లని నోటు అంటున్నావు. నీ మాటలుబట్టి చూస్తే,  కేంద్ర మంత్రివర్గంలో నువ్వొక చెలని మంత్రివి,’ అని రమేష్  అన్నారు.

 

ప్రత్యేక హోదా కాదని  ప్రత్యేక ప్యాకేజీ కోసం పరిగెత్తడం వెనక రహష్యం గురించి చెబుతూ, ప్రత్యేక ప్యాకేజీ వస్తే,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కుమారుడులోకేశ్ బాబుకు, సుజనా చౌదరికి కమిషన్లు వస్తాయని ఆయన అన్నారు.

 

బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు సంపాదించిన ఘనత సుజనా చౌదరిదని జోగి రమేష్ విమర్శంచారు.

 

ప్రత్యేకహోదా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని, తమ పార్టీ  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని, కేంద్రం మెడలు వంచుతామని ఆయన  తెలిపారు.

 

’కేంద్రం, చంద్రబాబు నాయుడు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం. హోదా వస్తేనే పేదల కడుపు నిండుతుంది. ఇలాంటి డిమాండ్ వదిలేసి ఏవరో కొద్ది మందికి పనికొచ్చే నియోజకవర్గాల పునర్విభజన కోసం ముఖ్యమంత్రి పోరాడతాననడం సిగ్గు చేటు,’ అని రమేష్ అన్నారు.  

 

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని,ఇలాంటి పనికి మాలిన దానికి పోరాడతాననడం సిగ్గు చేటు అని రమేష్ అన్నారు.

 

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu