
కడప: వారం రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన తొమ్మిదేళ్ల తనీష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తనీష్ ను వదిలిపెట్టాలంటే రూ. 8 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన లేఖను గ్రామంలో వదిలిపెట్టారు. తనీష్ తండ్రి డబ్బులను సమకూర్చుకొంటున్నాడు. ఈ తరుణంలో తనీష్ డెడ్‌బాడీ లభ్యమైంది. వారం రోజుల తర్వాత తనీష్ మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కడప జిల్లాలోని రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో ఈ ఘటన చోటు చేసుకొంది.
గ్రామంలోని అంకాలమ్మగుడి సమీపంలో తనీష్ ను గొంతుకోసి హత్య చేశారు. ఈ గుడికి సమీపంలోని ముళ్లపొదల్లో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు.క్షుద్రపూజల కోసమే తన కొడుకును చంపేసి ఉంటారని తనీష్ తండ్రి ఆరోపిస్తున్నారు. తన కొడుకును దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.