మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను పీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన ఏపీ సర్కార్

Published : Feb 17, 2022, 11:06 AM ISTUpdated : Feb 17, 2022, 02:37 PM IST
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను పీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన ఏపీ సర్కార్

సారాంశం

ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ (Goutam Sawang) నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ సర్కార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 

ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ (Goutam Sawang) నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ సర్కార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గౌతమ్ సవాంగ్‌కు ఎటువంటి పోస్టింగ్ కేటాయించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే తాజాగా ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది.

ఇక, 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్‌ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు ఇంకా సర్వీసు ఉండగా ఆకస్మత్తుగా బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్.. ఆయనను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu