బట్టలు ఉతకడానికి గెడ్డలో దిగి.. గురుకుల విద్యార్థి మృతి.. (వీడియో)

By AN TeluguFirst Published Oct 2, 2021, 3:02 PM IST
Highlights

స్థానికులు సహకారంతో విద్యార్థి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి గడ్డ దిగువన ఒడ్డు పొరలో చాటున విద్యార్థి మృతదేహం లభించింది. 

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగూడ మండలం కించుమండ గిరిజన సంక్షేమం బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సమీప గడ్డలో గల్లంతయ్యాడు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఉదయం అల్పాహారం తర్వాత సహచర విద్యార్థులతో బట్టలు ఉతకడానికి సమీప గడ్డకు వెళ్లిన బురిడి ఆనందరావు ప్రమాదవశాత్తు జారిపడి  గల్లంతయ్యాడు.  

"

విషయాన్ని సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా స్థానికులు సహకారంతో విద్యార్థి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి గడ్డ దిగువన ఒడ్డు పొరలో చాటున విద్యార్థి మృతదేహం లభించింది. 

విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ కుమారుడు మరణానికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

click me!