కారుపైకి ఎక్కి పోలీసులకు పవన్ వార్నింగ్.. శ్రమదానం కార్యక్రమంలో హైడ్రామా

By telugu team  |  First Published Oct 2, 2021, 1:34 PM IST

పవన్ కళ్యాణ్ కారు ఎక్కి ఆగ్రహంతో ఊగిపోతూ.. పోలీసులపై నిప్పులు చెరిగారు. తమ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల తీరు సరికాదని మండిపడ్డారు. అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన చుట్టూమూగి నినాదాలిచ్చారు. శ్రమదానం కార్యక్రమంలో భాగంగా రాజమండ్రీకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. 
 


అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులుపై నిప్పులు చెరిగారు. కారుపైకి ఎక్కి వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. తమ కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ఆయన రాజమండ్రికి వెళ్లారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని జనసేన ఈ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. రోడ్లపై గుంతలు పూడ్చి శ్రమదానం చేయాలని జనసేన నిర్ణయించింది. 

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ బాలాజీపేటకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ వెంట కార్యకర్తలు పెద్దఎత్తున కదలి వచ్చారు. దీంతో పోలీసులూ ఉద్రికత్తతలు ఏర్పడకుండా మోహరించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కారుపైకి ఎక్కి ఊగిపోతూ పోలీసులపై నిప్పులు చెరిగారు. తమ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని, పోలీసు తీరు తప్పని ఆరోపించారు. అనంతరం ఆయన బొమ్మూరు సెంటర్‌లోనే ఆగిపోయారు.

Latest Videos

కాగా, పవన్ కళ్యాణ్ శ్రమదానంపై కార్యక్రమంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయపరిణతి ఉన్న వ్యక్తి కాదని విమర్శించారు. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి గెలవాలన్నారు. ఇప్పటికే ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ ముఖ్యమంత్రినే విమర్శించడమేంటని అడిగారు. ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. 

ఇంతా చేసి ఇవన్నీ రోడ్ల గుంతలు పూడ్చటానికేనా? అయినా పవన్ ఎవరూ రోడ్ల గుంతలు పూడ్చడానికి, అది ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. నవంబర్ నుంచి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేస్తుందని సజ్జల అన్నారు.

click me!