గిద్దలూరులో దారుణం... కాపీ కొట్టనివ్వలేదని బ్లేడ్ తో ప్రిన్సిపల్ గొంతుకోసిన స్టూడెంట్

Published : Jun 30, 2023, 10:19 AM IST
గిద్దలూరులో దారుణం... కాపీ కొట్టనివ్వలేదని బ్లేడ్ తో ప్రిన్సిపల్ గొంతుకోసిన స్టూడెంట్

సారాంశం

పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకున్నాడని కాలేజీ ప్రిన్సిపల్ పై ఓ ఇంటర్మీడియట్ యువకుడు బ్లేడ్ తో గొంతుకోసం చంపడానికి ప్రయత్నించాడు. ఈ దారుణం ప్రకాశంజిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం : పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకుని డిబార్ చేయించాడని కాలేజీ ప్రిన్సిపల్ పై కక్షగట్టాడు ఇంటర్మీడియట్ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. పట్టపగలే నడిరోడ్డుపై ప్రిన్సిపల్ ను పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్లేడ్ తో గొంతుకోసం చంపడానికి ప్రయత్నించాడు. విద్యార్థి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రిన్సిపల్ ప్రస్తుతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చిన్నమసీదు ప్రాంతంతో గొంట్ల గణేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా గల జూనియర్ కాలేజీలో అతడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గతేడాది గిద్దలూరులోని సాహితీ జూనియర్ కాలేజీలో అతడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడు కాపీ కొడుతుండగా కాలేజీ ప్రిన్సిపల్  కొండారెడ్డి పట్టుకున్నాడు. దీంతో ఎగ్జామ్ సెంటర్ అధికారులు గణేష్ డీబార్ చేసారు. 

అయితే కాపీ కొడుతుండగా పట్టుకున్న ప్రిన్సిపల్ కొండారెడ్డిపై గణేష్ కక్షగట్టాడు. కోపంతో రగిలిపోతున్న అతడికి నిన్న(గురువారం) గాంధీబొమ్మ సెంటర్ వద్ద కొండారెడ్డి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. గొంతు కోసి చంపడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన కొండారెడ్డి తప్పించుకునేందుకు చేయి అడ్డుపెట్టాడు. దీంతో గొంతుతో పాటు చేయికి కూడా గాయమయ్యింది. 

Read More  స్కూల్లో మధ్యాహ్నభోజనం చేస్తుండగా వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన మూడో తరగతి విద్యార్థి...

దాడి అనంతరం గణేష్ అక్కడినుండి పరారయ్యాడు. రక్తస్రావంతో కిందపడిపోయిన ప్రిన్సిపల్ కొండారెడ్డిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. వెంటనే వైద్యం అందించిన డాక్టర్లు ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. 

ప్రిన్సిపల్ పై బ్లేడ్ దాడి జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం హాస్పిటల్లో వున్న కొండారెడ్డి నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసారు. నిందితుడు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే