మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐకి నేటీతో గడువు ముగియనుంది. అయితే ఈ కేసు విచారణకు మరింత సమయం కావాలని సీబీఐ కోరే అవకాశం ఉంది.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు నేటీతో గడువు ముగియనుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణకు మరింత సమయం కోరాలని సీబీఐ భావిస్తుందని సమాచారం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో పలువురు నిందితులు, అనుమానితుల నుండి స్టేట్ మెంట్లను సీబీఐ సేకరించింది. మరో వైపు ఈ కేసులో పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది.
undefined
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణలోని సీబీఐ కోర్టు విచారిస్తుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇటీవలనే నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు కోర్టుకు కూడ తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఈ కేసులో ఐదుదఫాలు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇవాళ కోర్టులో సీబీఐ అధికారులు సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ చార్జీషీట్ లో సీబీఐ ఏ అంశాలను ప్రస్తావిస్తారోననేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో వైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు గడువును కోరాలని సీబీఐ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తుంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ గడువు రెండు సార్లు పొడిగించారు.
మరోసారి కూడ విచారణ గడువు కోరాలని సీబీఐ కోరితే కోర్టు ఏ రకంగా స్పందిస్తుందోననేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో హియరింగ్ ఉంది. దీంతో నిందితులను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.