విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: రేపటి సమ్మె వాయిదా, కారణమిదే

By Siva KodatiFirst Published May 5, 2021, 4:00 PM IST
Highlights

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇచ్చిన రేపటి సమ్మె పిలుపును కార్మిక సంఘాలు వెనక్క తీసుకున్నాయి. ప్రస్తుతం దేశంలోని కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా సమ్మె వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు కార్మిక నేతలు తెలిపారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇచ్చిన రేపటి సమ్మె పిలుపును కార్మిక సంఘాలు వెనక్క తీసుకున్నాయి. ప్రస్తుతం దేశంలోని కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా సమ్మె వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు కార్మిక నేతలు తెలిపారు. దేశంలోని కోవిడ్ ఆసుపత్రులకు విశాఖ ఉక్కు నుంచి భారీగా ఆక్సిజన్ సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే. 

లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే ముందుంటోంది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో గతేడాది కూడా స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.

Also Read:ఊపిరిపోస్తున్న విశాఖ ఉక్కు... ప్రైవేటీకరణ సబబేనా: చిరంజీవి సంచలన ట్వీట్

గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్దినెలలుగా కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

click me!