గుంటూరు జిల్లా అమరావతి మండలం జూపూడిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుక ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై పలువురు రాళ్లదాడికి దిగారు.
గుంటూరు జిల్లా (Guntur district) అమరావతి మండలం (amaravathi) జూపూడిలో (jupudi) మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మళ్లీ రాళ్లతో దాడులకు దిగాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. రాళ్ల దాడిలో సీఐ శివప్రసాద్ తలకు గాయమైంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
కాగా.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (ambedkar jayanti) సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే పాతకక్షల నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై కొందరు దుండగులు రాళ్లదాడికి దిగారు. అంతటితో ఆగకుండా వారి ఇళ్లపైకి దాడికి దిగి కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసారు. దీంతో జూపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బలగాలతో జూపూడికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటుచేసారు. ర్యాలీపై రాళ్లు రువ్విన దుండగులను గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.