వైసిపి ఆఫీసుపై దాడికేసులో ట్విస్ట్ ... కేవలం పసుపు చొక్కా వేసాడనే అరెస్ట్ చేసారట..!

By Arun Kumar PFirst Published Jan 1, 2024, 12:16 PM IST
Highlights

గుంటూరులో మంత్రి విడదల రజని కార్యాలయంపై రాళ్లదాడి కేసులో తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు సిద్దమయ్యింది.  

గుంటూరు : డిసెంబర్ 31 రాత్రి గుంటూరులో ప్రతిపక్ష తెలుగుదేశం, జసేన పార్టీ జరుపుకున్న సంబరాలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గత రాత్రి ఇరుపార్టీల నాయకులు గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ర్యాలీ విద్యానగర్ మీదుగా వెళుతుండగా మంత్రి విడదల రజని కొత్తగా ఏర్పాటుచేసిన వైసిపి కార్యాలయం వారికంటపడింది. ఇంకేముంది ప్రారంభానికి సిద్దంగా వున్న ఆ కార్యాలయాన్ని చూడగానే టిడిపి, జనసేన నాయకులు రెచ్చిపోయి రాళ్ళదాడికి దిగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు.  

ఇలా విడదల రజని కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడితో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని... కేవలం పసుపు రంగు చొక్కా వేసుకున్నందుకే అరెస్ట్ చేసారని రాంబాబు భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ తప్పూ చేయని తన భర్తను వదిలిపెట్టాలని ఆమె పోలీసులను కోరుతోంది.  

Latest Videos

గత రాత్రి చర్చికి వెళ్లిన భర్త రాంబాబు విద్యానగర్ లో నివాసముండే తన సోదరుడిని విడిచిపెట్టడానికి వెళ్లినట్లు ఆమె తెలిపారు. ఇదే సమయంలో కొందరు వైసిపి కార్యాలయంపై దాడి చేస్తుండటంతో ఏం జరుగుతుందో చూసేందుకు ఆగారన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు తన భర్త ఎల్లో చొక్కా వేసుకున్నాడు కాబట్టి టిడిపికి చెందినవాడని అనుమానించి అరెస్ట్ చేసారన్నారు. ఇలా దాడితో ఏ సంబంధం లేని తన భర్తను అరెస్ట్ చేయడం ఏమిటని రాంబాబు భార్య ప్రశ్నించారు. 

వీడియో

తన భర్త రాంబాబు వైసిపి కార్యాలయంపై దాడి చేసినట్లు ఆధారాలుంటే చూపించాలని ఆమె కోరారు. రాత్రి నుండి తన భర్తను పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించారని... కనీసం ఆయనను చూసేందుకు కూడా తమకు అనుమతివ్వడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. తన భర్తకు షుగర్, బిపి వుందని... కనీసం ట్యాబ్లెట్స్ అయినా ఇవ్వాలని కోరుతున్న పోలీసులు వినిపించుకోవడంలేదని రాంబాబు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

Read Also గుంటూరులో పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి టీడీపీ గూండాల పనే.. వదిలేప్రసక్తే లేదు.. విడుదల రజిని

click me!